నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ.. విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
- ఈ నెల 13 వరకు జరగనున్న రొట్టెల పండుగ
- కోర్కెలు తీరాలంటూ రొట్టెలు ఇచ్చిపుచ్చుకోనున్న జనం
- 2015లో రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం
బారా షహాద్ దర్గా వద్ద ఈ నెల 13 వరకు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు కులమతాలు, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. తమ కోర్కెలు తీరాలంటూ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ పండుగకు జాతీయస్థాయిలోనూ గుర్తింపు ఉంది.