అమరావతిని మార్చడం సాధ్యం కాదని విజయసాయికి అర్థమైంది: రఘురామకృష్ణరాజు
- మూడు రాజధానుల ఏర్పాటు తమ వల్ల కాదని విజయసాయి చెప్పకనే చెప్పారన్న రఘురామ
- పార్లమెంటులో ఇప్పటివరకు రెండు ప్రైవేటు బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయన్న నర్సాపురం ఎంపీ
- జగన్‌పైనా విమర్శలు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టడంపై రఘురామ స్పందిస్తూ.. అమరావతిని తరలించడం తమ వల్ల కాదని విజయసాయికి అర్ధమైందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదం పొందాలని కోరుతున్నారని విమర్శించారు. అమరావతిని కదిలించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. పార్లమెంటులో ఇప్పటి వరకు రెండు ప్రైవేటు మెంబరు బిల్లులు మాత్రమే పాసైనట్టు రఘురామరాజు గుర్తు చేశారు.