వచ్చే రెండేళ్లలో రెట్టింపు కానున్న భారత పర్యాటక విపణి విలువ
- భారత్ లో పెరుగుతున్న పర్యాటకం
- తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు
- 2024 నాటికి రూ.30 లక్షల కోట్లు దాటనున్న టూరిజం మార్కెట్
రాకపోకలతో కూడిన భారత పర్యాటక మార్కెట్, భారత పర్యాటకులు, ప్రయాణికులు తాము ఖర్చు చేసే డబ్బుకు తగిన సేవలు పొందడం తదితర అంశాలపై ఈ నివేదికలో సూత్రప్రాయంగా వివరించారు. ప్రముఖ పర్యాటక స్థలాలతో ప్రభుత్వం నేరుగా సంబంధాలు నెరపడం, విదేశీ విహార నౌకలను భారత సముద్ర జలాల్లోనూ అనుమతించడం వంటి అంశాలను కూడా ఈ నివేదికలో స్పృశించారు.