చైనా చేపట్టింది విన్యాసాలు కాదు... మా భూభాగంపై దాడికి సన్నాహాలు: తైవాన్ ఆరోపణ
- తైవాన్ లో నాన్సీ పెలోసీ పర్యటన
- చైనా ప్రతీకార చర్యలు
- తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో విన్యాసాలు
- దాడికి చైనా ప్రణాళిక రూపొందిస్తోందన్న తైవాన్
చైనా చేపట్టింది సైనిక విన్యాసాలుగా తాము భావించడంలేదని, అవి తైవాన్ భూభాగంపై దాడికి సన్నాహాలుగా భావిస్తున్నామని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. తైవాన్ జలసంధి ప్రాంతంలో అనేక చైనా విమానాలు, నౌకలను తాము గమనించామని, తైవాన్ ప్రధాన భూభాగంపై ఎలా దాడి జరపాలన్నదానిపై అవి ముందస్తు సన్నాహాలు చేశాయని నమ్ముతున్నామని వెల్లడించింది. చైనా విమానాలు, నౌకల్లో కొన్ని మధ్యస్థ రేఖను కూడా దాటాయని ఆరోపించింది.