జైల్లో అర్పిత ముఖర్జీ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తున్న ఈడీ... కోర్టుకు విన్నపం
- టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో అరెస్టయిన అర్పిత
- మాజీమంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలిగా గుర్తింపు
- అర్పిత నివాసాల్లో రూ.49 కోట్ల లభ్యం
- పార్థ ఛటర్జీ, అర్పితలకు 14 రోజుల రిమాండ్
అంతకుముందు, అర్పిత తరఫు న్యాయవాది ఈ అంశాన్ని కోర్టుకు విన్నవించారు. తన క్లయింటుకు జైల్లో మరింత భద్రత ఏర్పాటు చేయాలని, ఆమె తినే ఆహారం, తాగునీటిని ముందుగానే పరీక్షించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అర్పిత ముఖర్జీ న్యాయవాది వాదనలతో ఈడీ న్యాయవాది కూడా ఏకీభవించారు. ఆమెను ఉంచిన గదిలో నలుగురు ఖైదీల కంటే ఎక్కువమందిని ఉండనివ్వరాదని కోర్టును కోరారు.