సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
- ప్రేమించి పెళ్లిచేసుకున్న నాగచైతన్య, సమంత
- విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన వైనం
- ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఇరువురి వ్యవహారం
- తాజాగా ఈ అంశంపై స్పందించిన నాగచైతన్య
తన మాజీ భార్య సమంత అంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందని, ఆమెను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోయామని నాగచైతన్య వెల్లడించారు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నామని, చెప్పామని అన్నారు. కానీ, కొందరు ఈ విషయంలో పనిగట్టుకుని ఏవేవో ఊహాగానాలు సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.