రాయల్ ఎన్ ఫీల్డ్ ‘హంటర్’ లుక్స్ చూశారా..?

Royal Enfield Hunter 350 revealed
  • త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్న కంపెనీ
  • మోటార్ బైక్ ఫొటోలు, వివరాల విడుదల
  • మెట్రో, రెట్రో పేరుతో రెండు వేరియంట్లలో విడుదల
రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 వాహన ప్రియుల మనసు దోచేలా ఉంది. త్వరలోనే ఇది విడుదల కానుంది. ఈ వాహనానికి సంబంధించి ఫొటోలను సంస్థ విడుదల చేసింది. జావా 42, హోండా సీబీ350 ఆర్ఎస్ కు ఇది పోటీ ఇవ్వనుంది. 

రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 వాహనం మోటారు ఇంజన్ ఇందులో కూడా ఉంటుంది. అదే శక్తి, అదే టార్క్ ను కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. గరిష్ఠంగా 114 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఒక లీటర్ కు 36 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ వాహనం బరువు 181 కిలోలు, క్లాసిక్ 350 కంటే 10 కిలోలు తక్కువ.

ముందు భాగంలో 17 అంగుళాల చక్రంతో వస్తున్న తొలి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఇది. ముందు, వెనుక ట్యూబ్ లెస్ టైర్లే ఉంటాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 మెట్రో, రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 రెట్రో అని రెండు రకాలను కంపెనీ తీసుకురానుంది. ఇందులో రెట్రో ఎంట్రీ లెవల్ మోడల్, ఇందులో స్పోక్ వీల్స్ ను కూడా ఆఫర్ చేయనుంది. 
Go Back to Shorts
Royal Enfield
Hunter 350
revealed
two varients

More Telugu News