ఇదంతా నాపై చేస్తున్న కుట్ర: న్యూడ్ వీడియో కాల్ వివాదం పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందన
- మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడారంటూ మాధవ్ పై వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- ఇది మార్ఫింగ్ వీడియో అన్న మాధవ్
దీని వెనుక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా ఎస్పీకి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ టెస్టుకు పంపాలని అన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని చెప్పారు. ఈ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వీడియోలో ఉన్నది తానే అని నిరూపిస్తే తన తల నరుక్కుని ఏబీఎన్ రాధాకృష్ణ కాళ్ల దగ్గర పెడతానని చెప్పారు.