Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ సినీ నిర్మాత అన్బు చెజియన్ కు చెందిన 40 లొకేషన్లలో ఐటీ సోదాలు

IT raids on Kollywood producer Anbu Chezhiyan
  • చెన్నై, మధురై, ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు
  • అన్బుపై ఐటీ దాడులు  జరగడం ఇది మూడో సారి
  • మరి కొందరు సినీ ప్రముఖులు కూడా ఐటీ స్కానర్ లో ఉన్నారని ప్రచారం
ప్రముఖ తమిళ సినీ నిర్మాత, ఫిల్మ్ ఫైనాన్షియర్ జీఎన్ అన్బు చెజియన్ పై ఐటీ అధికారులు రెయిడ్ చేస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, మధురైలలో ఆయనకు చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే రెయిడింగ్స్ జరుగుతున్నాయి. అన్చు చెజియన్ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. మధురైలోనే దాదాపు 30 చోట్ల సోదాలు జరుగుతుండగా... చెన్నై, ఇతర ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. 

అన్బు చెజియన్ పై ఐటీ దాడులు కొనసాగుతుండటంతో తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. అన్బుపై ఐటీ దాడులు జరగడం ఇది మూడోసారి. మరోవైపు కోలీవుడ్ కు చెందిన మరి కొందరు ప్రముఖులు కూడా ఐటీ స్కానర్ లో ఉన్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో, పలువురు సినీ పెద్దలు కలవరానికి గురవుతున్నారు. చివరిసారి 2020 ఫిబ్రవరిలో ఐటీ రెయిడ్స్ జరిగాయి. విజయ్ నటించిన 'బిగిల్' సినిమా విడుదలైన తర్వాత ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో విజయ్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Anbu Chezhiyan
Kollywood
IT Raids

More Telugu News