'పుష్ప' సినిమా డైలాగ్ చెప్పిన ఉద్ధవ్ థాకరే
- సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేసిన ఈడీ
- ఇది బీజేపీ చేసిన దాడి అన్న థాకరే
- సంజయ్ రౌత్ ఎవరికీ తలొగ్గే మనిషి కాదని వ్యాఖ్య
సంజయ్ రౌత్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని... ఆయనను చూసి గర్విస్తున్నానని థాకరే చెప్పారు. 'పుష్ప' సినిమాలో 'తగ్గేదే లే' అనే డైలాగ్ ఉందని.. అలాగే సంజయ్ రౌత్ కూడా ఎవరికీ తలొగ్గే మనిషి కాదని తెలిపారు. బాల్ థాకరే నిజమైన శివసైనికుడు రౌత్ అని కొనియాడారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ... బీజేపీ బెదిరింపులకు లొంగకపోవడమే సంజయ్ రౌత్ చేసిన నేరమని అన్నారు. రౌత్ ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి అని చెప్పారు.