‘పక్కా కమర్షియల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

  • ఆగస్టు 5 నుంచి ఆహాలో ప్రసారం
  • గోపీచంద్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం
  • మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రానికి మిశ్రమ స్పందన
ఫలితాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు హీరో గోపీచంద్. ‘సీటీమార్’ చిత్రంతో విజయాల బాట పట్టిన అతను తాజాగా ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. మారుతి ద‌ర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జులై 1న థియేటర్లలో విడుదలైంది. కానీ, బాక్సాఫీస్ ద‌గ్గర ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. 

బన్నివాసు నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది.  ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ ఈ చిత్ర హక్కులు కొనుగోలు చేసింది. ఆగస్టు 5 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో చూడని వాళ్లు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంట్లోనే చూడాలంటే ఇంకో ఐదు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.

Tollywood
aha
gopichand
pakka commercial
movie
ott release

More Telugu News