కామన్వెల్త్ గేమ్స్‌లో కొనసాగుతున్న భారత్ హవా.. వెయిట్‌లిఫ్టింగ్‌లో నాలుగో పతకం
- కామన్వెల్త్లో కొనసాగుతున్న భారత లిఫ్టర్ల హవా
- 23 ఏళ్ల బింద్యారాణికి రజతం
- ఒక్క కేజీ తేడాతో స్వర్ణం కొల్లగొట్టిన నైజీరియా లిఫ్టర్
55 కేజీల విభాగంలో పోటీపడిన బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కేజీలతో మొత్తంగా 202 కేజీలు ఎత్తి రజత పతకం సాధించింది. నైజీరియాకు చెందిన అదిజాత్ ఒలారినోయ్ పసిడి పతకం కొల్లగొట్టింది. బింద్యారాణి కంటే ఒక్క కేజీ ఎక్కువగా 203 కేజీలు ఎత్తిన అదిజాత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు కాంస్యం దక్కింది.