3డీలో కేసీఆర్ సూక్ష్మ క‌ళాకృతి... ఆక‌ట్టుకుంటున్న ఫొటో ఇదిగో

Ahmednagar Craftsman presented a amazing 3D miniature of Telangana CM KCR
  • రూపొందించిన అహ్మ‌ద్ న‌గ‌ర్‌కు చెందిన క‌ళాకారుడు
  • నేడు కేసీఆర్‌కు అంద‌జేసిన వైనం
  • ట్విట్ట‌ర్‌లో ఫొటోల‌ను పోస్ట్ చేసిన టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మ‌హారాష్ట్రలోని అహ్మ‌ద్ న‌గ‌ర్‌కు చెందిన సూక్ష్మ క‌ళాఖండాల రూప‌శిల్పి 3డీ రూపంలో అతి చిన్న శిల్పంలో ఆవిష్క‌రించారు. ఈ క‌ళాఖండాన్ని ఆ యువ శిల్పి శ‌నివారం సీఎం కేసీఆర్‌కు అంద‌జేశారు. స‌ద‌రు సూక్ష్మ శిల్పంలో కేసీఆర్‌ను ఆ క‌ళాకారుడు ఉద్య‌మ‌కారుడిగా తీర్చిదిద్దారు. 

ఓ గుండ్ర‌టి దిమ్మ‌పై నిల‌బ‌డ్డ కేసీఆర్ త‌న పిడికిలిని బిగించి ఉద్య‌మ స్ఫూర్తిని నింపుతున్న‌ట్లుగా ఆ శిల్పంలో క‌నిపిస్తున్నారు. ఈ సూక్ష్మ శిల్పాన్ని, దానిని రూపొందించిన క‌ళాకారుడి చిత్రాల‌ను టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌, తెలంగాణ స్టేట్ టెక్నాల‌జీ స‌ర్వీసెస్ చైర్మ‌న్ జ‌గ‌న్ పాటిమీది సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.
Go Back to Shorts
3D
KCR
TRS
Maharashtra
Ahmednagar
Craftsman

More Telugu News