Audi: రూ.1.66 కోట్ల విలువైన ఎల‌క్ట్రిక్ కారులో ఉపాస‌న‌... వీడియో ఇదిగో

  • ఇటీవ‌లే కొత్త కారును కొన్న ఉపాస‌న‌
  • ఆడి ఇ-ట్రాన్ ఎల‌క్ట్రిక్ కారు కొన్న‌ట్లు వెల్ల‌డి
  • ప్ర‌పంచానికి అనుగుణంగా తాను మారాన‌న్న రాంచ‌ర‌ణ్ అర్ధాంగి 
Upasana Konidela in her new audi e tron electric car

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ భార్య ఉపాసన కొణిదెల ఓ కొత్త కారును కొన్నారు. ఆడి కంపెనీకి చెందిన ఎల‌క్ట్రిక్ కారు అయిన ఆడి ఇ-ట్రాన్‌లో ఆమె విహ‌రిస్తున్నారు. ఈ కారు విలువ రూ.1.66 కోట్ల పైమాటే. ఈ కారులో తాను ఎంత సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణిస్తున్నాన‌న్న విష‌యాన్ని ఆమె త‌న కొత్త కారులో కూర్చుని మ‌రీ వివ‌రించారు.

ప్ర‌పంచంలో ప్ర‌తిదీ అప్‌గ్రేడ్ అవుతోంద‌ని తెలిపిన ఉపాస‌న‌... అందుక‌నుగుణంగా తాను కూడా అప్‌గ్రేడ్ అయ్యాన‌ని తెలిపారు. అందులో భాగంగానే ఆడి ఇ-ట్రాన్‌ను కొనుగోలు చేశాన‌ని తెలిపారు. ఈ కారులో తాను ఎంతో సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించ‌గ‌లుగుతున్నాన‌ని, త‌న అన్ని అవ‌స‌రాల‌కు ఈ కారు అనువుగా ఉంద‌ని కూడా ఆమె తెలిపారు.

More Telugu News