Team India: రోహిత్ శర్మ అర్ధసెంచరీ, దినేశ్ కార్తీక్ దూకుడు... టీమిండియా భారీ స్కోరు

Team India posts huge total after Rohit Sharma fifty and Dinesh Karthik hard hitting
షార్ట్స్‌లో చూడండి
వెస్టిండీస్ తో తొలి టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 64 పరుగులు చేశాడు. చివర్లో దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

సూర్యకుమార్ యాదవ్ 24, పంత్ 14, జడేజా 16 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, ఒబెద్ మెక్ కాయ్ 1, జాసన్ హోల్డర్ 1, అకీల్ హోసీన్ 1, కీమో పాల్ 1 వికెట్ పడగొట్టారు.
Go Back to Shorts
Team India
Rohit Sharma
Dinesh Karthik
West Indies
1st T20

More Telugu News