టీఆర్ఎస్ ఎంపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన హెటిరో బాధిత సంఘం
- హెటిరో పార్థసారథిరెడ్డిపై ఫిర్యాదు చేసిన బాధితులు
- ఆయనపై ఉన్న కేసులను అఫిడవిట్ లో పేర్కొనలేదని ఫిర్యాదు
- రాజ్యసభ సభ సభ్యత్వంపై వేటు వేయాలని విన్నపం
పార్థసారథి రెడ్డి అంశానికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్తామని... సీబీఐ, ఈడీలకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అంతమ్మగూడెంలో పార్థసారథిరెడ్డికి చెందిన హెటిరో డ్రగ్స్ కంపెనీ వల్ల 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కంపెనీ గురించి పొల్యూషన్ కంట్రోల్ బ్యూరోకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్థసారథిరెడ్డి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నారు.