తమపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
- పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఆవరణలో నిరసన
- ప్రధాని మోదీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు
- రాజ్యసభలో ఈ వారాంతం వరకు 19 మంది ఎంపీల సస్పెన్షన్
- ఇందులో ముగ్గురు టీఆర్ ఎస్ ఎంపీలు
రాజ్యసభలో సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని, బిగ్గరగా నినాదాలు చేస్తున్నారంటూ మంగళవారం 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు. వీళ్లపై సస్పెన్షన్ ఈ వారాంతం వరకు కొనసాగనుంది. సస్పెండైన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దీవకొండ దామోదర్ రావు కూడా ఉన్నారు.