5జీ స్పెక్ట్రమ్ కు అదరిపోయే డిమాండ్... తొలిరోజు వేలంలో రూ.1.45 లక్షల కోట్లు దాటిన బిడ్డింగ్

Huge response to 5G spectrum auction
  • దేశంలో మరికొన్ని నెలల్లో 5జీ సేవలు
  • 72 గిగాహెర్జ్ స్పెక్ట్రమ్ కోసం నేడు వేలం
  • బరిలో 4 కంపెనీలు.. ముగిసిన తొలిరోజు వేలం
  • నాలుగు రౌండ్లు నిర్వహించామన్న కేంద్రమంత్రి  
భారత్ లో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత వేగవంతమైన మొబైల్ టెలికాం సేవలకు 5జీ వీలుకల్పించనుంది. ఈ నేపథ్యంలో, నేడు 72 గిగాహెర్జ్ 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం వేలం షురూ అయింది. ఈ ఆధునికతరం బ్యాండ్ విడ్త్ కోసం డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తొలిరోజే స్పష్టమైంది. మొదటి రోజున బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటింది. భారత్ లో టెలికాం స్పెక్ట్రమ్ కోసం ఇంత భారీ వేలం నిర్వహించడం ఇదే ప్రథమం 

కాగా, జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ కు చెందిన యాక్టివ్ లీ వంటి సంస్థలు పాల్గొనడంతో తొలిరోజే అద్భుతమైన స్పందన కనిపించింది. తొలిరోజు వేలంలో నాలుగు రౌండ్లు నిర్వహించామని, బిడ్డింగ్ మొత్తం రూ.1.45 లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రేపు ఐదో రౌండ్ వేలం చేపడతామని తెలిపారు. 

ఆగస్టు 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తవుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 3300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ బాండ్స్ కోసం కంపెనీలు తీవ్రంగా పోటీపడ్డాయని మంత్రి వివరించారు.
Go Back to Shorts
5G
Auction
Spectrum
Bidding
India

More Telugu News