ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్తో వైసీపీ ఎంపీల భేటీ... ఫొటో ఇదిగో
- ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన ధన్కర్
- ఆయా పార్టీల నేతలతో సమావేశమవుతున్న జగదీప్
- సాయిరెడ్డి నేతృత్వంలో ధన్కర్ను కలిసిన వైసీపీ ఎంపీలు
తాజాగా మంగళవారం జగదీప్ ధన్కర్తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులు ధన్కర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ధన్కర్ విజయం సాధించాలని వారంతా ఆకాంక్షించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వనున్న సంగతి తెలిసిందే.