హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుమ్మేసిన వాన.. చెరువులను తలపించిన రోడ్లు
- అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం
- రోడ్లు జలమయం.. ట్రాఫిక్‌కు అంతరాయం
- కోఠిలో కొట్టుకుపోయిన బైక్
ముఖ్యంగా బంజారాహిల్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ముషీరాబాద్, కాప్రా, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కోఠిలో వరద నీటిలో ఓ మోటారు బైక్ కొట్టుకుపోగా, మలక్‌పేట వంతెన దిగువన నడుము లోతులో నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఎల్బీనగర్ పరిధిలోని చింతల్‌కుంట జాతీయ రహదారిపైనా మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది.