రేపు ఈడీ విచార‌ణ‌కు సోనియా గాంధీ... నిర‌స‌న‌ల వ్యూహంపై పార్టీ కీల‌క భేటీ

congress chief sonia gandhi will attend ed enquiry tomorrow
నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రేపు (మంగ‌ళ‌వారం) మ‌రోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే ఓ రోజు ఈడీ విచార‌ణ‌కు సోనియా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 21న త‌మ ముందు హాజ‌రైన సోనియాను 3 గంట‌ల పాటు విచారించిన ఈడీ అధికారులు...తిరిగి ఈ నెల 26న మ‌రోమారు విచార‌ణ‌కు రావాల‌ని నాడే స‌మ‌న్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మంగ‌ళ‌వారం మ‌రోమారు ఈడీ విచార‌ణ‌కు సోనియా గాంధీ హాజ‌రు కానున్న నేప‌థ్యంలో సోమ‌వారం కాంగ్రెస్ పార్టీ ఓ కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం సాయంత్రం జ‌రిగిన ఈ భేటీకి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, ఆయా రాష్ట్రాల శాఖ‌లు, విభాగాల ఇంచార్జీలు, ఎంపీలు హాజర‌య్యారు. ఈ భేటికి నేతృత్వం వ‌హించిన పార్టీ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే... అహింసా ప‌ద్ధ‌తుల్లోనే బీజేపీ స‌ర్కారుకు నిర‌స‌న తెలియ‌జేయాల‌ని సూచించారు.
Go Back to Shorts
Congress
Sonia Gandhi
Enforcement Directorate
National Herald

More Telugu News