రేపు ఈడీ విచారణకు సోనియా గాంధీ... నిరసనల వ్యూహంపై పార్టీ కీలక భేటీ
- నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు సోనియా
- ఇప్పటికే ఓ పర్యాయం విచారణకు హాజరైన వైనం
- మంగళవారం మరోమారు ఈడీ ముందుకు కాంగ్రెస్ అధినేత్రి
- శాంతియుత నిరసనలకు కాంగ్రెస్ నిర్ణయం
మంగళవారం మరోమారు ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరు కానున్న నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీకి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల శాఖలు, విభాగాల ఇంచార్జీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటికి నేతృత్వం వహించిన పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే... అహింసా పద్ధతుల్లోనే బీజేపీ సర్కారుకు నిరసన తెలియజేయాలని సూచించారు.