'భరతవర్ష: సాగా ఆఫ్ శూల’... గోపీచంద్ కొత్త చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్
మాస్ హీరో గోపీచంద్ తన 33వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ‘భరతవర్ష : సాగా ఆఫ్ శూల’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, సోమవారం టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ మునుపెన్నడూ కనిపించని రీతిలో వారియర్ అవతారంలో ఆకట్టుకున్నారు. భీకర యుద్ధ సన్నివేశాలతో ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ చిత్రం 7వ శతాబ్దం నాటి అవిభక్త భారతదేశంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. చారిత్రక అంశాలకు పౌరాణిక నేపథ్యాన్ని జోడించి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దీన్ని రూపొందిస్తున్నారు. గ్లింప్స్‌లో కనిపించిన గ్రాండ్ విజువల్స్, ఉత్కంఠభరితమైన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి. గోపీచంద్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్‌కు ఈ భారీ హిస్టారికల్ యాక్షన్ చిత్రం కమ్‌బ్యాక్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.