దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్టుపై జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు
- ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వదు
- ఇతర కులాల్లోని నిరుపేదల పరిస్థితి ఏమిటని ప్రశ్న
- శ్రీలంక సంక్షోభాన్ని చూసిన తర్వాత కేంద్రంలో మార్పు వచ్చింది
శ్రీలంక సంక్షోభాన్ని చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మార్పు వచ్చిందని... దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా చర్యలకు ఉపక్రమిస్తోందని జేపీ చెప్పారు. రాష్ట్రాల అప్పులపై కేంద్రం దృష్టిని సారించడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని రాజ్యాంగ వ్యవస్థ అయిన ఫైనాన్స్ కమిషన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని చెప్పారు.