india: దేశంలో 20 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

India corona updates
  • గత 24 గంటల్లో 20,279 కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 36 మంది మృతి
  • 1.52 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 20,279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18,143 మంది కరోనా నుంచి కోలుకోగా... 36 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,52,200కి పెరిగింది. దేశంలో క్రియాశీల రేటు 0.35 శాతంగా, రికవరీ రేటు 98.45 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. 

ఇప్పటి వరకు 2,01,99,33,453 మందికి వ్యాక్సిన్ వేయగా ... నిన్న ఒక్క రోజే 28,83,489 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 4,32,10,522 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,26,033 మంది మృతి చెందారు. 

More Telugu News

india
Corona Virus
Updates