YSRCP: చంద్రబాబూ...మీతో అగ్రనటులు కూడా పోటీ పడలేరు: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy satires on chandrababu
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో రెండు రోజులుగా పర్య‌టించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌రో వ్యంగ్యాస్త్రం సంధించారు. చంద్ర‌బాబుతో సినీ అగ్ర న‌టులు కూడా పోటీ ప‌డ‌లేర‌ని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా చౌక‌బారు డ్రామాలు మీ పేటేంటేనంటూ చంద్ర‌బాబుకు ఆయ‌న చురకంటించారు.

వ‌ర‌ద ప్రాంతాల్లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నా... ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చంద్ర‌బాబు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ప్ర‌జ‌లు వ‌ర‌ద నీటిలో నానా ఇక్క‌ట్లు ప‌డుతుంటే... సీఎం జ‌గ‌న్ గాల్లో విహ‌రిస్తున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. 

ఈ సంద‌ర్భంగా తాగ‌టానికి ఈ నీళ్లే దిక్కంటూ ఓ వ‌రద బాధితురాలు బాటిల్‌లో మురుగు నీటిని అందించగా.. చంద్ర‌బాబు దానినే చూపుతూ జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ఈ అంశాన్ని ప్ర‌స్తావించిన సాయిరెడ్డి... వరద నీటిని బాటిల్లో నింపి జనం వాటినే తాగుతున్నారని మీరు నమ్మించాలని చూస్తే వరద బాధితులే నవ్వుకుంటున్నారని విమ‌ర్శించారు. మీరు జన్మలో మారరంటూ చంద్ర‌బాబుపై సాయిరెడ్డి మ‌రో వ్యాఖ్య చేశారు.
Go Back to Shorts
YSRCP
Vijay Sai Reddy
TDP
Chandrababu
Floods

More Telugu News