రామ్ సినిమా 6 రోజుల వసూళ్లు ఇవే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ సినిమా 6 రోజుల వసూళ్లు ఇవే!

The Warrior Movie Update
  • ఈ నెల 14న విడుదలైన 'ది వారియర్'
  • రామ్ సరసన అలరించిన కృతి శెట్టి
  • యాక్షన్ పరంగా .. సాంగ్స్ పరంగా ఎక్కువ మార్కులు
  • నిరాశ పరిచిన లవ్ ట్రాక్ .. రొమాన్స్ 
  • వసూళ్లపై వర్షాల ప్రభావం
రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రను ఆది పినిశెట్టి పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. 

6 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 24.50 కోట్ల గ్రాస్ ను .. 15.93 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 31.05 కోట్ల గ్రాస్ ను .. 18.43 కోట్ల షేర్ ను రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు చెబుతున్నారు. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ను బట్టి చూసుకుంటే, ఇంకా 20 కోట్లను రాబడితే బ్రేక్ ఈవెన్ కి చేరుకుంటుందని అంటున్నారు.

కథలో కొత్త పాయింట్ ఉన్నప్పటికీ లింగుసామి స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేయలేకపోయాడు. తమిళంలో ఆయనకి ఉన్న క్రేజ్ కూడా అక్కడ ఈ సినిమాకి భారీ వసూళ్లను తేలేకపోయింది. వర్షాల కారణంగా వసూళ్లు తగ్గాయనే టాక్ కూడా ఉంది . మాస్ యాక్షన్ .. మాస్ సాంగ్స్ కి తోడు, కాస్త రొమాన్స్ పాళ్లు పెంచితే బాగుండేదనే అభిప్రాయాలు తొలిరోజునే వినిపించాయి
Ram
Krithi Shetty
Adi Pinishetty
The warrior Movie

More Telugu News