'విరాటపర్వం' దర్శకుడి నుంచి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్!

Venu Udugula next movie
షార్ట్స్‌లో చూడండి
వేణు ఊడుగుల తన సినిమాల కోసం తయారు చేసుకునే కథలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. తన కథల్లోని పాత్రలు ఆకాశంలో నుంచి ఊడిపడినట్టుగా కాకుండా సహజత్వానికి చాలా దగ్గరగా నడిపించుకుంటూ వెళతాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'విరాటపర్వం' సినిమా కూడా ఇదే విషయాన్ని నిరూపించింది. 

ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టలేకపోయినా, ఒక మంచి ప్రయత్నం అనిపించుకుంది. దాదాపు బయోపిక్ లక్షణాలతో వచ్చిన ఈ సినిమా ఆయనకి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన సినిమా ఏ హీరోతో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఆ విషయాన్ని వెల్లడిస్తాడని వేణు ఊడుగుల చెబుతున్నాడు. 

ఈ సారి తాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక కథను రెడీ చేసుకున్నట్టుగా ఆయన చెప్పాడు. ఇది తాను తయారు చేసుకున్న కల్పిత కథ అనీ ... పూర్తి కమర్షియల్ అంశాలతో ఉంటుందని అన్నాడు. హీరో .. హీరోయిన్ ఎవరనే విషయాలతో పాటు మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Venu Udugula
Virataparvam Movie
Tollywood

More Telugu News