నుపుర్ శర్మకు ఊరట... ఆగస్టు 10 వరకు చర్యలు వద్దన్న సుప్రీంకోర్టు
- మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్
- అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంను ఆశ్రయించిన నేత
- నుపుర్‌కు ప్రాణ హాని ఉందని వ్యాఖ్యానించిన కోర్టు
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సోమవారం నుపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తనకు పలు వర్గాల నుంచి ప్రాణ హాని ఉందని కూడా ఆమె కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా మార్చాలని కూడా ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు నుపుర్ శర్మకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.