చాలా రోజుల త‌ర్వాత అసెంబ్లీకి వ‌చ్చిన గంటా శ్రీనివాసరావు... ఫొటో ఇదిగో

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గంటా శ్రీనావాస‌రావు చాలా రోజులుగా క‌నిపించ‌డ‌మే లేదు. 2019 ఎన్నిక‌ల్లో విశాఖ ఉత్త‌ర స్థానం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న అస‌లు అసెంబ్లీలో క‌నిపించ‌డ‌మే మానేశార‌న్న వాద‌న‌లు వినిపించాయి. వైసీపీలో చేరిపోతున్నార‌ని, బీజేపీలో చేరిపోతున్నారంటూ ప్ర‌చారం సాగింది. అయితే ఇవేవీ ప‌ట్టించుకోని ఆయ‌న త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయారు.

తాజాగా సోమ‌వారం రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ కోసం గంటా శ్రీనివాసరావు అసెంబ్లీకి వ‌చ్చారు. పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఇత‌ర స‌భ్యుల‌తో క‌లిసి అసెంబ్లీకి వ‌చ్చిన ఆయ‌న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌న ఓటు వేశారు. ఈ ఫొటోనే ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నాన‌ని ఆయ‌న తెలిపారు.

Ganta Srinivasa Rao
TDP
President Of India
President Of India Election
Andhra Pradesh
Amaravati

More Telugu News