తెలంగాణలో తాజాగా 441 మందికి కరోనా

Telangana corona news bulletin
  • గత 24 గంటల్లో 21,616 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 272 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 692 మంది
  • ఇంకా 4,649 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 21,616 శాంపిల్స్ పరీక్షించగా, 441 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 272, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26, రంగారెడ్డి జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 692 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు.

తెలంగాణలో ఇప్పటివరకు 8,09,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,01,018 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,649 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Bulletin
Update

More Telugu News