ఢిల్లీలో మౌన దీక్షకు దిగిన కేఏ పాల్
- విభజన చట్టం హామీల అమలే ప్రధాన డిమాండ్‌గా పాల్ దీక్ష
- బుధవారం జంతర్‌మంతర్ వద్ద నిరసనకు దిగనున్నట్లు ప్రకటన
- ఆగస్టు 15 తర్వాత ఆమరణ దీక్షకు దిగుతానన్న ప్రజా శాంతి పార్టీ అధినేత
రాష్ట్ర విభజన చట్టం హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. అప్పటికీ విభజన చట్టం హామీలు అమలు కాకుంటే ఆగస్టు 15 నుంచి తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తెలుగు ప్రజలు సత్తా చూపకపోతే విభజన చట్టం హామీలు అమలు కావన్న పాల్.. ఈ కారణంగానే తాను దీక్షలకు దిగుతున్నట్లు తెలిపారు.