'ది వారియర్' ఫస్టు డే వసూళ్లు ఇవే!
- రామ్ హీరోగా వచ్చిన 'ది వారియర్'
- తొలి రోజునే 8.73 కోట్ల షేర్
- వీకెండ్ లో వసూళ్లు పెరిగే ఛాన్స్
- పోటీగా దగ్గరలో లేని పెద్ద సినిమాలు
తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8.73 కోట్ల షేర్ ను వసూలు చేసింది. వచ్చేవారం వరకూ పోటీ ఇచ్చే సినిమా లేకపోవడం వలన, వీకెండ్ లో వసూళ్ల జోరు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ గా రామ్ నటించిన ఈ సినిమాలో, రేడియో జాకీగా కృతి శెట్టి కనిపించింది. తెరపై ఈ జోడీ ఆకట్టుకుంది.
కథలో కొత్తదనం ఉంది .. కానీ కథనంలో ఆ కొత్తదనం కనిపించదు. అలాగే రామ్ పాత్రను మలిచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. అదే సమయంలో కృతి పాత్రకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడం కనిపిస్తుంది. ఇలా సినిమా ఓహో అనిపించకపోయినా, పాటల పరంగా చాలావరకూ నెట్టుకొచ్చేసింది.
.