పార్లమెంటులో ప్లకార్డులు, పాంప్లేట్లు కూడా నిషేధమే!
- మార్గదర్శకాలు జారీ చేసిన లోక్ సభ సెక్రటేరియట్
- కరపత్రాలు, ఇతర ఏ రూపాల్లోని ముద్రిత సమాచారం ప్రదర్శించకూడదు
- వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఆదేశాలు
పార్లమెంటులో ధర్మాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వకపోవడం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు ఆవరణలో నినాదాలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. ఎటువంటి సాహిత్యం కానీ, ప్రశ్నలు, కరపత్రాలు, ప్రెస్ నోట్లు, ఇతర రూపాల్లోని సమాచారాన్ని కానీ స్పీకర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శించడాన్ని నిషేధించారు.