ఎగువ ప్రాంతాల్లో వర్షాలు... శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు
- పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
- ఉప్పొంగుతున్న కృష్ణా నది
- జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
- శ్రీశైలం ప్రాజెక్టుకు 36 వేల క్యూసెక్కుల వరదనీరు
జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయగా... 36,678 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 824 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు మరో రెండుమూడు రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.