ఏపీ టూర్ ముగించిన ద్రౌపది ముర్ము... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం
- రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము
- ఏపీ ప్రజా ప్రతినిధుల మద్దతు కోసం విజయవాడకు వచ్చిన వైనం
- వీడ్కోలు పలికిన విజయసాయిరెడ్డి, సోము వీర్రాజు
ఏపీ పర్యటనలో ద్రౌపది ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. తిరుగు ప్రయాణంలోనూ ఆయన ముర్ము వెంటే ఢిల్లీకి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరిన ముర్ముకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజులు వీడ్కోలు పలికారు.