Mamata Banerjee: కలకలం.. మమతా బెనర్జీ ఇంటి వద్ద ఏడు సార్లు రెక్కీ నిర్వహించిన ఉగ్రవాది!

  • ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి రెక్కీ నిర్వహించిన ఉగ్రవాది
  • ఫోన్ లో మమత ఫొటోలు తీసిన వైనం
  • 11 సిమ్ కార్డులను వాడిన ఉగ్రవాది
Terrorist recced near Mamata Banerjee house

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద ఒక ఉగ్రవాది ఏడు సార్లు రెక్కీ నిర్వహించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. కోల్ కతా లోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న మమత ఇంటి గురించి సమాచారం తెలుసుకునేందుకు ఉగ్రవాది రెక్కీ నిర్వహించాడని పోలీసులు గుర్తించారు. తన సెల్ ఫోన్ తో మమత నివాసాన్ని ఫొటోలు తీశారని పోలీసులు తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి హఫీజుల్ మొల్లా అనే ఉగ్రవాది భద్రతా ఏర్పాట్లను దాటి ముఖ్యమంత్రి నివాసంలోకి ఇనుపరాడ్ తో ప్రవేశించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారని చెప్పారు. 

మొల్లాను విచారించిన సమయంలో పలు విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. మొల్లా 11 సిమ్ కార్డులను ఉపయోగించాడని... బంగ్లాదేశ్, బీహార్, ఝార్ఖండ్ లకు ఫోన్లు చేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో అతనికున్న కార్యకలాపాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. మరోవైపు మొల్లా పోలీసు కస్టడీని ఈ నెల 18 వరకు కోర్టు పొడిగించింది. సీఎం నివాసం వద్ద ఉగ్రవాది రెక్కీ నేపథ్యంలో... సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్ ను పదవి నుంచి తొలగించారు.

More Telugu News