షావోమీ నుంచి స్మార్ట్ ఫ్యాన్ విడుదల
- స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2 ఆవిష్కరణ
- ధర రూ.6,999
- ఫ్యాన్ స్పీడ్ కు 1 నుంచి 100 లెవల్స్
ఫ్యాన్ స్పీడ్ ను 1 నుంచి 100 లెవల్స్ మధ్య సెట్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. నేచురల్ బ్రీజ్, డైరెక్ట్ బ్లో తదితర భిన్నమైన మోడ్స్ లోకి మార్చుకోవచ్చు. బీఎల్ డీసీ మోటార్ (కాపర్ వైర్), డ్యుయల్ ఫ్యాన్ బ్లేడ్లు ఉంటాయి. గరిష్ఠంగా 14 మీటర్ల వరకు గాలిని ఇస్తుంది. ఫ్యాన్ ఎత్తును కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ ధర రూ.6,999. షావోమీ పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో 7 ప్లస్ 5 అంటే.. ఏడూ రెక్కలు ఒక వైపునకు తిరిగి ఉంటే, ఐదు రెక్కలు మరో దిశలో ఉంటాయి. దీనివల్ల గాలి బాగా వస్తుంది.