మీడియా ముందుకు వచ్చిన పవిత్రా లోకేశ్ మాజీ భర్త
- మీడియాలో నరేశ్, పవిత్రా లోకేశ్ బంధంపై కథనాలు
- చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించిన నరేశ్ భార్య
- పవిత్రకు రిలేషన్స్ అలవాటేనన్న మాజీ భర్త
- తమకు పెళ్లే కాలేదన్న పవిత్ర
- ఆధారాలు ఉన్నాయన్న మాజీ భర్త
ఈ నేపథ్యంలో, సుచేంద్ర ప్రసాద్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తమది ప్రేమపెళ్లి అని వెల్లడించారు. అయితే, ఉద్దేశపూర్వకంగానే మ్యారేజి సర్టిఫికెట్ తీసుకోలేదని తెలిపారు. మ్యారేజి సర్టిఫికెట్ విదేశీ విధానం అని, అందుకు తాము వ్యతిరేకం అని వివరించారు. కానీ, ఆధార్ కార్డు, పాస్ పోర్టును పరిశీలిస్తే పవిత్ర తన భార్యే అని స్పష్టమవుతుందని వివరించారు. తామిద్దరం భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు హాజరయ్యామని కూడా సుచేంద్ర చెప్పారు.