టీమిండియాతో చివరి టీ20లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్
- 2-0తో సిరీస్ నెగ్గిన టీమిండియా
- నేడు నాటింగ్ హామ్ లో మూడో టీ20
- టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- టీమిండియాలో నాలుగు మార్పులు
- కీలక ఆటగాళ్లకు విశ్రాంతి
కాగా, ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ కోసం జట్టులో నాలుగు మార్పులు చేసింది. రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చారని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చహల్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి కల్పించినట్టు తెలిపాడు. అటు, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టులోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. పార్కిన్సన్, శామ్ కరన్ లకు తుదిజట్టులో స్థానం లభించలేదు. రీస్ టాప్లే, ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చారు.