వైరస్​ సోకితే మన శరీరం నుంచి ఓ రకం వాసన.. దోమలతో కుట్టించి, మరింత వ్యాపించేందుకు వైరస్​ లు వేసే ప్లాన్​ అది!

09-07-2022 Sat 15:12 | Science
  • వైరస్‌ లు శరీర వాసనలను మార్చేస్తాయని కనెక్టికట్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
  • బాధితులను కుట్టేలా దోమలను ఆ వాసనలు ఆకర్షిస్తాయని గుర్తింపు
  • డెంగ్యూ, జికా సోకినవారికి అందుకే దోమలు మరింతగా కుడతాయని వెల్లడి
వైరస్.. అది పూర్తి స్థాయిలో జీవమూ కాదు, అలాగని బతికిలేదని చెప్పలేని ఓ కణం. అత్యంత సూక్ష్మంగా ఉన్నా.. భూమిపై అన్ని రకాల జీవజాలాన్నీ సతాయించే శక్తి వాటి సొంతం. అసలే కరోనా వైరస్ మానవాళిని వణికిస్తోంది. ఇలాంటి సమయంలో  వైరస్ లకు ఉన్న మరో శక్తి తాజా పరిశోధనలో బయటపడింది. వైరస్ లు మనుషుల నుంచి వెలువడే వాసనలను మార్చేస్తాయని.. ఆ వాసనలు దోమలను బాగా ఆకర్షిస్తాయని తేలింది. ఇలా దోమలను ఆకర్షించి, అవి మనల్ని కుట్టడం ద్వారా.. మరింతగా వ్యాపించేందుకు వైరస్ లు మార్గం వేసుకుంటున్నట్టు వెల్లడైంది. 

రెండు యూనివర్సిటీల ఆధ్వర్యంలో..
అమెరికాకు చెందిన కనెక్టికట్‌ యూనివర్సిటీ, చైనాలోని బీజింగ్ సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అంశంపై పరిశోధన చేశారు. దోమల ద్వారా సంక్రమించే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి జ్వరాలతో ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. కోట్లాది మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధులు వ్యాపించడానికి ప్రధాన కారణం దోమలు. ఒక రోగిని కుట్టిన దోమలు.. మరికొందరిని కుడుతూ వెళ్లడం వల్ల అందరికీ ఆ వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ క్రమంలో అప్పటికే వ్యాధి సోకినవారిని దోమలు ఎక్కువగా కుడుతుండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదేమిటో తేల్చే దిశగా పరిశోధన చేసి.. అసలు వైరస్ లే మన శరీర వాసనలను మార్చేస్తున్నట్టు తేల్చారు.

ఎలా వాసనను మార్చేస్తున్నాయి?
వైరస్‌ సోకినవారి చర్మం నుంచి అసిటోఫెనోన్‌ అనే ఒక వాసన వస్తోందని.. దానికి దోమలు ఆకర్షితం అవుతున్నట్టు గుర్తించామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన కనెక్టికట్ వర్సిటీ ఇమ్యూనాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పెంగ్వా వాంగ్‌ తెలిపారు. బాసిల్లస్‌ అనే బ్యాక్టీరియా ఈ అసిటోఫెనోన్‌ తయారీలో కీలకమని.. డెంగ్యూ, జికా వైరస్‌ లు బాసిల్లస్‌ బ్యాక్టీరియాపై ప్రభావం చూపి అసిటోఫెనోన్‌ ను పెంచుతున్నాయని చెప్పారు.

దీని పరిష్కారానికి సంబంధించి ఎలుకలపై ప్రయోగం చేశామని, వాటికి విటమిన్ 'ఏ'ను ఇచ్చి, బాసిల్లస్ బ్యాక్టీరియాను తగ్గించేలా చేస్తే.. దోమలు ఆకర్షితం కావడం తగ్గిందని పెంగ్వా వాంగ్ వెల్లడించారు. మనుషులపైనా ఇలాంటి ప్రయోగం చేస్తే.. దోమల బారి నుంచి, వాటితో సోకే రోగాల నుంచి మానవాళిని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.

VirusSmellMosquitoesScienceOffbeat

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more