నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: హీరోయిన్ ప్రియా ఆనంద్
- గతంలో నిత్యానందతో సన్నిహితంగా గడిపిన ఒక హీరోయిన్
- ఇప్పుడు ఆయనపై మనసు పారేసుకున్న మరో హీరోయిన్
- నిత్యానందపై ప్రేమను వ్యక్తపరిచిన ప్రియా ఆనంద్
ఇప్పుడు మరో హీరోయిన్ ప్రియా ఆనంద్.. నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పలు తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది. తమిళం, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నిత్యానంద గురించి తన మనసులోని ప్రేమను వ్యక్తపరిచింది. ఆయన గురించి ఎంతో వ్యతిరేక ప్రచారం జరుగుతున్నప్పటికీ... వేలాది మంది భక్తులు ఆయనను ఆరాధిస్తున్నారని చెప్పారు. ఆయనను పెళ్లి చేసుకుంటే తన పేరును కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు.