ఇక నేను కూడా పెళ్లి చేసుకుంటా... పంజాబ్ సీఎం వివాహానికి పెళ్లి పెద్దగా వ్యవహరించిన ఆప్ యువ ఎంపీ

Raghav Chadha as Groomsman to Bhagwant Mann wedding
  • గుర్ ప్రీత్ కౌర్ ను పెళ్లాడిన పంజాబ్ సీఎం మాన్
  • ఎంపీ రాఘవ్ చద్దా చేతుల మీదుగా పెళ్లి
  • మాన్ ముఖంలో సంతోషం చూసి ఎమోషనల్
  • త్వరలోనే తాను ఓ ఇంటివాడ్నవుతానన్న చద్దా
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హర్యానాకు చెందిన 32 ఏళ్ల డాక్టర్ గుర్ ప్రీత్ కౌర్ ను 48 ఏళ్ల మాన్ ఇవాళ చండీగఢ్ లోని తన నివాసంలో పెళ్లాడారు. కాగా, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ శుభకార్యానికి ఆప్ యువ ఎంపీ రాఘవ్ చద్దా (33) పెళ్లిపెద్దగా వ్యవహరించారు. ఈ పెళ్లి తన చేతుల మీదుగా జరగడంతో ఎంతో ఆనందదాయకం అని రాఘవ్ చద్దా తెలిపారు.

ఈ పెళ్లితో భగవంత్ మాన్ కుటుంబంలో చాన్నాళ్ల తర్వాత సంతోషం వెల్లివిరుస్తోందని, ఈ పెళ్లితో అందరికంటే ఎక్కువగా ఆనందిస్తున్న వ్యక్తి మాన్ తల్లి అని చద్దా వెల్లడించారు. పంజాబ్ సీఎం పెళ్లికి ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా వచ్చారు. అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ మనోహరమైన కార్యక్రమం జరిగిందని ఎంపీ రాఘవ్ చద్దా వివరించారు. 

భగవంత్ మాన్ తనకు పెద్దన్నలాంటి వారని, ఇప్పుడాయన వివాహానికి తాను పెద్దగా వ్యవహరించానని తెలిపారు. మాన్ జీవితంలో మళ్లీ సుఖశాంతులు వస్తాయని ఆశిస్తున్నానని, ఈ పెళ్లిలో ఆయన సంతోషంగా ఉండడం చూసి తాను భావోద్వేగాలకు లోనయ్యానని వివరించారు. ఈ శుభకార్యం సందర్భంగా ప్రతి ఒక్కరూ "నీ పెళ్లెప్పుడు?" అని అడుగుతున్నారని, త్వరలోనే తాను కూడా ఓ ఇంటివాడ్నవుతానని రాఘవ్ చద్దా తెలిపారు. అంతేకాదు, "అమ్మే నా ప్రాణం" అంటూ తల్లిపై ప్రేమను చాటుకున్నారు.
Go Back to Shorts
Raghav Chadha
Groomsman
Bhagwant Mann
Wedding
Punjab
AAP

More Telugu News