Nupur Sharma: నుపుర్ శర్మ తలను తెస్తే ఇల్లు రాసిస్తా: అజ్మీర్ వాసి

Ajmer man offers house property to anyone who decapitates suspended BJP leader Nupur Sharma
  • తలను ఎవరు తెస్తే వారికే నా ఆస్తులు అంటూ ప్రకటన
  • అజ్మీర్ వాసి వీడియో వివాదాస్పదం
  • చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసుల ప్రకటన
రాజస్థాన్ లోని అజ్మీర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వివాదాస్పద ఆఫర్ చేశాడు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసినవారికి తన ఇల్లు, ప్రాపర్టీని రాసిస్తానని ప్రకటించాడు. ఈ ఆఫర్ ఇచ్చిన వ్యక్తిని సల్మాన్ చిస్టీగా గుర్తించారు. 

ఎవరైనా సరే నుపుర్ శర్మ తలను తీసుకొస్తే వారికి తన ఆస్తులను ఇచ్చేస్తానని సల్మాన్ చెబుతున్నట్టు వీడియో ఒకటి వెలుగు చూసింది. దేశవ్యాప్తంగా ముస్లింలను హింసిస్తున్నారని, చంపుతున్నారని అతను వ్యాఖ్యానించాడు. సల్మాన్ అజ్మీర్ లోని ప్రముఖ చిస్టీ దర్గా ప్రాంతానికి చెందిన నివాసిగా అతనిని పోలీసులు గుర్తించారు. 

దీనిపై అడిషనల్ ఎస్పీ వికాస్ సాంగ్వాన్ స్పందించారు. తాను సైతం ఈ వీడియోను వాట్సాప్ ద్వారా చూశానని, సల్మాన్ మత్తులో మాట్లాడినట్టు ఉందని పేర్కొన్నారు. సల్మాన్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అతడ్ని పట్టుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Nupur Sharma
Ajmer man
decapitates
house property
Offer

More Telugu News