హిందూ దేవతలున్న పేపర్లలో చికెన్ ప్యాకింగ్.. యూపీలో ముస్లిం వ్యాపారి అరెస్ట్
- సంభాల్ ప్రాంతంలో చికెన్ వ్యాపారి నిర్వాకం
- విచారణకు వచ్చిన పోలీసులపై కత్తితో దాడికి యత్నించిన వ్యాపారి
- అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసిన పోలీసులు
తాలీబ్ హుస్సేన్ అనే వ్యాపారి హిందూ దేవత, దేవుడి చిత్రాలున్న పేపర్లలో చికెన్ ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడని, మత మనోభావాలను గాయపరుస్తున్నాడంటూ కొంత మంది ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు తాలీబ్ హుస్సేన్ షాపులో తనిఖీకి వెళ్లగా.. కత్తితో పోలీసులపైకి అతడు దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ సెక్షన్ 153-ఏ, సెక్షన్ 295ఏ, సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.