ఇండియా కరోనా అప్డేట్స్.. స్వల్పంగా తగ్గిన కేసులు

India corona updates
  • గత 24 గంటల్లో 13,086 కేసుల నమోదు
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,864
  • 98.53 శాతంగా ఉన్న రికవరీ రేటు
ఇండియాలో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,086 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 12,456 మంది కరోనా నుంచి కోలుకోగా... 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,13,864 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,31,650కి చేరుకుంది. వీరిలో 4,28,79,477 మంది కోలుకున్నారు. 

ఇక ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 5,25,223కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.26 శాతంగా, రికవరీ రేటు 98.53 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, పాజిటివిటీ రేటు 2.90 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,97,98,21,197 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 1,78,383 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News