సిద్ధూ మూసేవాల హత్యకేసు: షార్ప్ షూటర్ అంకిత్ శిర్సా అరెస్ట్
- మే 29న సిద్ధూ మూసేవాల హత్య
- సిర్సా, షూటర్లకు ఆశ్రయమిచ్చిన సచిన్ భివానీ అరెస్ట్
- పిస్టల్, లైవ్ కార్టరిడ్జ్‌లు, తుపాకి స్వాధీనం
మే 29న సిద్ధూపై కాల్పులు జరిపిన నలుగురిలో అంకిత్ కూడా ఒకడు. సోనిపట్‌కు చెందిన అతడిపై రాజస్థాన్‌లో ఇప్పటికే రెండు హత్యాయత్నం కేసులున్నాయి. నిందితుల నుంచి ఒక 9 ఎంఎం బోర్ పిస్టల్, 10 లైవ్ కార్టరిడ్జ్‌లు, 0.30 తుపాకి, పంజాబ్ పోలీసుల యూనిఫామ్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక సిమ్ కార్డు, ఒక డాంగిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.