బడంగ్‌పేట మేయర్ చేరిక కోసం ఢిల్లీకి తరలివెళ్లిన టీ కాంగ్రెస్ అగ్ర నేతలు
- టీఆర్ఎస్కు రాజీనామా చేసిన పారిజాత దంపతులు
- అనుచరులతో కలిసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
- రేవంత్, భట్టి విక్రమార్క వెంట రాగా ఢిల్లీలో జరిగిన చేరికలు
పారిజాత దంపతులను పార్టీలోకి ఆహ్వానించేందుకు తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) అగ్రనేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు సహా పలువురు కీలక నేతలు పారిజాత దంపతులను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. రాహుల్ సమక్షంలోనే పారిజాత దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.