మీరు నిప్పుతో చెలగాటమాడలేరు... నుపుర్ శర్మను అరెస్ట్ చేయండి: మమతా బెనర్జీ డిమాండ్
- మహ్మద్ ప్రవక్తపై నుపుర్ తీవ్ర వ్యాఖ్యలు
- దేశీయ, అంతర్జాతీయంగా దుమారం
- 'ఈ వివాదం మొత్తం ఓ కుట్ర' అన్న మమత
- అన్ని వర్గాల వారి కోసం పాటుపడతామని వెల్లడి
ఈ వివాదం మొత్తం ఓ కుట్ర అని అన్నారు. దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీనే ఈ కుట్రకు పాల్పడిందని ఆమె ఆరోపించారు. విభజన, విద్వేషపూరిత రాజకీయాల పట్ల తమకు నమ్మకంలేదని, తాము హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధమతస్తులు, అన్ని వర్గాల వారి కోసం పాటుపడతామని మమతా బెనర్జీ ఉద్ఘాటించారు.
ఓ టీవీ చానల్ లో మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి నుపుర్ శర్మ ఆచూకీ లేకుండాపోయారు. ఆమెపై కోల్ కతాలోనూ రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఇటీవల కోల్ కతా పోలీసులు నుపుర్ కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.