Alluri Seetharama Raju: మోదీ, జ‌గ‌న్‌ల‌తో సెల్ఫీ తీసుకున్న రోజా!... భీమ‌వ‌రం వేదిక‌పై ఏపీ మంత్రి సంద‌డి!

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న విగ్ర‌హావిష్క‌ర‌ణ కోసం భీమ‌వ‌రంలో ఏర్పాటు చేసిన వేదిక మీద ఏపీ మంత్రి ఆర్కే రోజా సందడి చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలతో క‌లిసి ఆమె వేదికపైనే సెల్ఫీ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న సెల్ఫీలో మోదీ, జ‌గ‌న్‌ల చిత్రాలు విస్ప‌ష్టంగా క‌నిపించేలా ఆమె త‌న సెల్ యాంగిల్స్‌ను మారుస్తూ క‌నిపించారు. 

ఓ ద‌శ‌లో రోజా సెల్ఫీ తీయ‌డం అయిపోయింద‌ని భావించిన మోదీ ప‌క్క‌కు వెళ్లిపోయారు. అయినా కూడా రోజా ఆయ‌న‌ను అనుస‌రించి మ‌రోమారు ఆయ‌న‌ను సెల్ఫీకి పోజిచ్చేలా చేశారు. చివ‌ర‌కు వారిద్ద‌రితో క‌లిసి సెల్ఫీ తీసుకున్న రోజా సంతోషంగా క‌నిపించారు. ఈ వీడియోను ఓ జ‌ర్న‌లిస్టు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పనిలో పనిగా ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవితోనూ రోజా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన రోజా.. మన్యం వీరుడి  విగ్రహావిష్కరణ మహోత్సవం మధురానుభూతిని మిగిల్చిందని కామెంట్ చేశారు.
.
Alluri Seetharama Raju
YSRCP
YS Jagan
Roja
Prime Minister
Narendra Modi
Bhimavara

More Telugu News